Singareni | కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఈనెల 1వ తేదీ నుంచి ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టులకు సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇద్దరు డైరెక్టర్లను ఎంపిక చేశారు సంస్థలో జీఎంలుగా పనిచేస్తున్న పది మందిని ఇంటర్వ్యూలకు పిలిచిన యాజమాన్యం ఇద్దరూ జీఎంలను డైరెక్టర్లుగా ఎంపిక చేశారు.
పదిమందిలో డైరెక్టర్లుగా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎవరు ఊహించని విధంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎంగా విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ అడ్రియాల జీఎంగా విధులు నిర్వహిస్తున్న కొప్పుల వెంకటేశ్వర్లును డైరెక్టర్లుగా నియమించారు. వీరిలో ఒకరిని డైరెక్టర్ ఆపరేషన్‌గా, మరొకరిని డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ గా యజమాన్యం నియమించింది.
కొత్తగా ఎంపికైన డైరెక్టర్లకు అధికారులు, కార్మిక సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా నూతన డైరెక్టర్లుగా నియమించినట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది