జూలూరుపాడు, మార్చి 27 : భద్రాచలం పట్టణంలో బిల్డింగ్ కుప్పకూలి మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సిలివేరి నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన బిల్డింగ్ వర్కర్స్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొట్టకూటి కోసం కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గుడిమెట్ల సీతయ్య, నరసింహారావు, సురేశ్, వెంకటేశ్, రమేశ్ పాల్గొన్నారు.