కొత్తగూడెం సింగరేణి, మే 13 : సింగరేణి ఇల్లెందు క్లబ్లో కార్పొరేట్ జీఎంలు, ఏరియా జీఎంలు, ఏరియా ఇంజినీర్లు, సివిల్ ఇంజినీర్లు, సీహెచ్‌పీ ఇంజినీర్లతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 10 పీహెచ్‌సీల నుంచి రవాణా టార్గెట్‌పై సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. జీఎం సీహెచ్‌పీ స్వామినాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు మాట్లాడారు. కొత్త పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరిస్తూ డస్ట్ సప్రెషన్, ధ్వని కాలుష్యాన్ని నివారించి సీహెచ్పీలను ఆధునీకరించాలన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి నిర్దేశిత రవాణా టార్గెట్లను చేరుకోవాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని ఏరియాల సీహెచ్‌పీలకు నిర్దేశిత రవాణా లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఈ సమావేశంలో జీఎం సీపీపీ నాగభూషణ్‌రెడ్డి, జీఎంలు వైజీకే మూర్తి, రవిప్రసాద్, రమేశ్, నరసింహారావు, శాలెం రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.