అశ్వారావుపేట: ఎన్నోఏండ్లుగా పోడు సాగు చేసుకుంటున్నహక్కుదారులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. బుధవారం పట్టణంలోని సీపీఐ యంయల్ పార్టీ కార్యాలయం ఆవరణలో పోడు భూముల సాగు సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సమస్యను పరిష్కరించి గిరిజనులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముద్దా బిక్షం, వాసం బుచ్చిరాజు, కుంజా అర్జున్, పండా ముత్యాలు, కంగాల భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.