చండ్రుగొండ : ఈ నెలాఖరు కల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించి , వాటిని స్కూల్స్ పునః ప్రారంభం నాటికి సిద్దం చేయాలన్నారు.
ప్రతి తరగతి గదిని శానిటైజ్ చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు ప్రారంభం అయ్యేలా మండల అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి మాస్క్ ధరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.