బండి సంజయ్ కొడుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని పాల్వంచలో నిరసన
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచలో మంగళవారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, 7వ డివిజన్ కార్పొరేటర్ కాలేరు సింధు తపస్వి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన నిర్వహించారు.
పాల్వంచ, మే 12 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచలో మంగళవారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, 7వ డివిజన్ కార్పొరేటర్ కాలేరు సింధు తపస్వి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసేందుకు తాత్పర్యం చేస్తుందని పోలీసులు కూడా మెతక వైఖరి అవలంబిస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సామాన్యుడు చిన్న తప్పు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు, ప్రభుత్వం ఇంత పెద్ద తప్పు చేసిన ఒక ప్రముఖుడిని కాపాడేందుకు కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై బాధితులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సిఐడి దర్యాప్తు చేపట్టి తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ కాలేరు సింధు తపస్వి, పూజారి వెంకటేశ్వర్లు, శిఖ సాగర్, అఖిల్ మహర్షి, వాసు, లింగయ్య, నరేష్, నరసింహ, చింతా మోహన్, అరుణ, లక్ష్మీ, శైలజ, ఎస్తేరు, నాంచారమ్మ, రవి, సాహిత్ పాల్గొన్నారు.

బండి సంజయ్ కొడుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని పాల్వంచలో నిరసన
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

