ఇల్లెందు, జనవరి 01 : ఇల్లెందు సింగరేణి ఏరియాలో పలువురు ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను జీఎం వి.కృష్ణయ్య గురువారం అందజేశారు. ఇల్లెందు ఏరియాలో పని చేస్తున్న NCWA ఉద్యోగులకు 1 జనవరి,2026 నాటికీ అర్హత కలిగిన వారికి సర్వీస్ లింక్డ్ ప్రమోషన్స్-12, సర్వీస్ లింక్డ్ ఇంక్రిమెంట్- 4 ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 18 మంది ఉద్యోగులు అర్హత కలిగి ఉన్నారు. వారికి గురువారం జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం వి.కృష్ణయ్య ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సర్వీస్ లింక్డ్ ప్రమోషన్స్, సర్వీస్ లింక్డ్ ఇంక్రిమెంట్లు అందజేస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు ఉద్యోగులకు ఉత్తర్వులు అందజేసిన్లు చెప్పారు. అలాగే వారికి రావాల్సిన ప్రయోజనాలను ఈ నెల జీతం నుండి అందుతాయని తెలిపారు. ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులందరికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం రామస్వామి, ఏరియా ఇంజినీర్ ఆఫీసర్ నరసింహ రాజు, సేఫ్టీ అధికారి సి.ఆర్.భాను ప్రసాద్ రావు, డీజీఎం పర్సనల్ అజ్మీర తుకారాం, జే.కే.పి.ఓ జాకీర్ హుస్సేన్, డీజీఎం ఐ ఈ డి ప్రభాకర్, డీజిఎం (సివిల్) రవి కుమార్, డీజీఎం(యఫ్ & ఏ) నాగలక్ష్మి, ఏరియా సర్వే అధికారి రామమూర్తి, గుర్తింపు సంఘం పిట్ లచ్చిరాం, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ జె.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.