Mission bhagiratha | అసలే ఎండాకాలం.. తాగునీటి ఎద్దడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి తాగునీరందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథను ప్రారంభించారని తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్ హయాంలో మిషన్ భగీరథ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో ఈ ఘటనతో మరోసారి అర్థమవుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని హమాలి కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని తాగునీరు కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైను లీకు కావడంతో భారీగా తాగునీరు వృధాగా పోతుంది. అసలే ఎండాకాలం అందులో తాగునీరు అంతంత మాత్రంగానే వచ్చే పరిస్థితులు ఉన్నతరుణంలో ఇలా పైపులైను లీకు కావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందజేసిన అధికారులు ఎవరూ స్పందించే పరిస్థితులు లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఉన్నత అధికారులు స్పందించి పైపులైను లీకును మరమ్మతులు చేసి తాగునీటి వృధా పోకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?