Anna Lezhneva | అన్నా లెజినోవా సోషల్ మీడియాలో ఇటీవల చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తరచూ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్, ఆయన తల్లి అంజనా దేవి, తమ కూతురుతో కలిసి దిగిన ఓ పాత ఫ్యామిలీ ఫోటోను ఆమె షేర్ చేశారు. ఈ ఫోటోతో పాటు ఎంతో భావోద్వేగభరితమైన సందేశాన్ని కూడా పంచుకున్నారు.
19 ఏళ్లకే తల్లులైన మహిళల నుంచి, 40 ఏళ్ల వరకు ఎదురు చూసిన మహిళల వరకు.. సహజంగా పిల్లలకు జన్మనిచ్చిన వారితో పాటు ఐవీఎఫ్, ఎన్నో ఇంజెక్షన్లు, నిరీక్షణ, బాధలను ఎదుర్కొన్న మహిళల వరకు.. ప్రతి తల్లితనం గొప్పదే” అంటూ ఆమె పేర్కొన్నారు.అలాగే ఒంటరిగా పిల్లలను పెంచుతున్న తల్లులు, ఉద్యోగం మరియు కుటుంబం మధ్య పోరాడుతున్న మహిళలు, గర్భస్రావం లేదా బిడ్డను కోల్పోయిన బాధను భరించిన తల్లులు, భవిష్యత్తులో తల్లులు కావాలని కలలు కంటున్న మహిళలు.. అందరికీ ఆమె ప్రత్యేకంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఒక మహిళగా ఉండటానికి ఒకే మార్గం లేదు.. తల్లిగా మారటానికి కూడా ఒకే నిర్వచనం లేదు. ప్రతి తల్లితనం వెనుక త్యాగం, ప్రేమ, భయం, అలసట, బలం వంటి ఎన్నో కనిపించని భావాలు ఉంటాయి అంటూ అన్నా లెజినోవా చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అన్నా లెజినోవా పోస్ట్‌పై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.