Potholes | టేకులపల్లి, అక్టోబర్ 5 : గుంతలమయంగా ఎన్హెచ్ 930పీ.. వాహదారుల ఇబ్బందులు.. అనే శీర్షికతో నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ (www.ntnews.com)లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆదివారం ఉన్నతాధికారులు గుంతల మయంగా ఉన్న రోడ్డును పూడ్చే ప్రక్రియను ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ప్రజలకు ప్రయాణం నరకంగా మారిందని ఓ వైపు లారీల దుమ్ము, మరోవైపు గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం టు ఇల్లందు ప్రధాన రహదారి వెంట నిత్యం వేలాదిగా వాహనాలు తిరగడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నేషనల్ హైవే పూర్తయ్యేదెన్నడో రోడ్డు ఇంకా అధ్వానంగా తయారైందని రోడ్డుపై ప్రయాణించంటే నరకం అనుభవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మత్తులతో శాశ్వత పరిష్కారం చేయాలని, ఇప్పుడు చేస్తున్నది కూడా తాత్కాలికంగా పైపై వేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడక్కడ గుంతలు పూడుస్తున్నారని , పూర్తిస్థాయిలో గుంతలను పూడ్చి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Tekulapally : గుంతలమయంగా ఎన్హెచ్ 930పీ.. వాహదారుల ఇబ్బందులు
YS Jagan | ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు