రామవరం, జూన్ 21 : సింగరేణి సి&ఎండీ ఆదేశాల మేరకు పీవీకే 5 గని యందు గత వారం రోజులుగా గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో యోగాసనాల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గని మేనేజర్‌కు ఉన్న యోగా విజ్ఞానంతో ఉద్యోగులచే యోగాసనాలు వేయించారు. కృతజ్ఞతగా ఉద్యోగులందరు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేనేజర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో గని ఉద్యోగులతో పాటు అధికారులు, సూపర్ వైజర్లు, అన్ని యూనియన్ల నాయకులు, చిలక రాజయ్య, హుమాయన్, ఎస్.నాగేశ్వర్రావు, సకినాల సమ్మయ్య, భూక్య రమేశ్, వల్లలా సాంబమూర్తి, రాంచందర్, కొమ్ము సాంబయ్య, రమణ, సంపత్, రాంబాబు, షకీల్, శివరాం, శ్రీనివాస్, దస్తగిరి, రాజేశ్వరావు, దేవ్ సింగ్, బాలాజీ, ఈశ్వరయ్య, కోటేశ్వరరావు, పవన్, సైదులు పాల్గొన్నారు.