టేకులపల్లి, ఏప్రిల్ 24 : బీఆర్ఎస్ను ప్రజల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ చెంప చెళ్లుమనిపించేలా ఉందని బీఆర్ఎస్ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లలో పగుళ్లు వస్తే ఏకంగా కూలిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తూ కేసీఆర్, హరీశ్ రావును బద్నాం చేయాలని చూశారని మండిపడ్డారు. హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదిక అంతా ట్రాష్ అని తేల్చిందన్నారు. హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెక్ పెట్టేలా తీర్పు వచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేడిగడ్డ బరాజ్ కూలిపోయిందనే ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను గాలికి వదిలి డ్రైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకి చెంప పెట్టులాంటి తీర్పు హైకోర్టు ఇచ్చిందన్నరు. తెలంగాణ రైతాంగానికి సగం సాగునీరు అందేలా కేసీఆర్ కాళేశ్వరం రూపొందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట కొనుగోళ్లు లేవని, కరెంట్ రాదని, యూరియా దొరకదని, రైతులను గాలికి వదిలేశారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ టేకులపల్లి మండల ప్రధాన కార్యదర్శి, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు నాయక్, భూక్య బాలకృష్ణ ,జాలాది అప్పారావు, నామాల భిక్షం, అంగోతు లక్పతి, సర్పంచులు నాకా నాయక్, బానోత్ రామా నాయక్, మాజీ కోఆప్షన్ మౌలానా, కొండ బత్తుల శ్యామ్, ప్రశాంత్, మహిళా మండల అధ్యక్షురాలు ఆమడ రేణుక, నాగభూషణం పాల్గొన్నారు.