South Coast Railway Zone | దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి మధిర, మోటమర్రి రైల్వే స్టేషన్లు.. కేంద్రం నిర్ణయంతో దక్షిణ మధ్య పరిధి నుంచి ఔట్!
South Coast Railway Zone | మధిర : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు ఉన్న మధిర రైల్వేస్టేషన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేయాలని రైల్వే బోర్డును ఆదేశించింది.
South Coast Railway Zone | మధిర : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు ఉన్న మధిర రైల్వేస్టేషన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేయాలని రైల్వే బోర్డును ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఏపీ విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తెలంగాణ పరిధిలోని బోనకల్లు మండలం మోటమర్రి రైల్వే స్టేషన్ వరకు 46 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం రైల్వేస్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో ఖమ్మం జిల్లాలో ఖమ్మం తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఉన్న మధిర రైల్వే స్టేషన్, మోటమర్రి, తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లు ఇక నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్నప్పుడు రైల్వే పనుల కోసం గతంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సికింద్రాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు మధిర నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలు రైల్వే పనుల కోసం విజయవాడలోని డీఆర్ఎం కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా కొండపల్లి నుంచి మోటమర్రి వరకు పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. వారి స్థానంలో కొత్త ఉద్యోగులు రానున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

