ఇల్లెందు, జనవరి 10 : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యచరణపై కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, దిండిగాల రాజేందర్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.