భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మూడో రోజు గురువారం సర్వమత ప్రార్థనలు చేశారు. బర్త్‌డే కేక్ కటింగ్, మొక్కలు నా టారు. ప్రపంచమే గర్వించదగిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలని చర్చి పాస్టర్లు, ముస్లిం మతపెద్దలు, పూజారులు దీవెనలు అందించారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి అన్నదానం చేశారు. మ ణుగూరులో ప్రభుత్వ విప్ కాంతారావు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. అశోక్‌నగర్ సాయిబాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
– నెట్వర్క్