భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 25 : బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే జర్నలిస్టులకు ఉచితంగా స్థలాన్ని మంజూరు చేసిందని, ఆ స్థలాలను వెంటనే వారికి కేటాయించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఇండ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు చేసిన వంటా వార్పు కార్య క్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన కోరిక ఉచిత ఇంటి స్థలాలను వెంటనే కేటాయించాలన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు స్థలం కేటాయించుకుంటే వారితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదవత్ శాంతి, మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్ అంబుల వేణు, రుక్మాందర్ బండారి, వేముల ప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, బీఆర్ఎస్ నాయకులు కొత్వాల సత్యం, సత్యనారాయణ (సంపు), న్యాయవాది సాదిక్, నవతన్, నాగబాబు, నిజం,శివ, జానీ, కరాటే శీను, మునిలా, తూంపూరు ప్రసాద్, వినోద్, తొగర రాజశేఖర్, దూడల కిరణ్, సురేందర్, ఆవు నూరి చంద్రయ్య, పల్లెపు రాజు బొమ్మిడి రమాకాంత్, బుందుగల శ్రీధర్, కొయ్యాడ శీను, లచ్చిరం, కంచర్ల రామారావు పాల్గొన్నారు.
Housing Plots : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావు