రామవరం, ఆగస్టు 25 : మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులు సుమారు 42 మందికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి అయి ఐదు నెలలు గడుస్తున్నా వారి వారసులకు ఇంకా నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ అన్నారు. వారు ఉద్యోగాల ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారని, వీలైనంత త్వరగా ఉద్యోగ నియామక పత్రాలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగూడెం సోమవారం జీఎం షాలెం రాజుకు కార్మిక సమస్యలపై మెమొరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా జీఎం స్పందిస్తూ.. సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శితో పాటు సహాయ కార్యదర్శి గట్టయ్య, సత్తుపల్లి కార్యదర్శి సముద్రాల సుధాకర్, సివిల్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్, వర్క్ షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ, జిఎం కార్యాలయం పిట్ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.