ఇల్లెందు, జూన్ 30 : ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు కూడా తెలిపే హక్కు లేదా? ఇది ప్రజా పాలనా లేక పోలీస్ పాలనా అని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు సోమవారం చలో పూసుగూడెం నిరసన కార్యక్రమానికి తరలి వెళ్లిన ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ ని పోలీసులు మార్గ మధ్యంలోనే అడ్డుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ వారు మాట్లాడారు. అపర భగీరథుడు మాజీ సీఎం కేసీఆర్ రూ.3,200 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్‌ని రూపకల్పన చేస్తే నేడు అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్ట్‌ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం మీద ప్రశ్నించినా అధికార పార్టీ కంటే ముందు పోలీస్ వారు ప్రత్యక్షం అవడాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ అన్నా, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నా వెన్నుల్లో కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుందన్నారు. ప్రజా పాలన అని చెప్పి పోలీసులతో పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్ట్ జలాలను ఇల్లెందు నియోజకవర్గానికి తరలించకుండా ఆంధ్రాకి తరలించి జలదోపిడి చేయాలని చూస్తే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, పోలీస్ కేసులుత తమను ఆపలేవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్ నాయక్, ఇల్లెందు మండలాధ్యక్షుడు శీలం రమేశ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర్ భావ్ సింగ్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, సోషల్ మీడియా విభాగం యువజన నాయకుడు గిన్నారపు రాజేశ్, సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్ యాదవ్, సోషల్ మీడియా అండ్ యువజన విభాగం ఎంటెక్ మహేందర్, పట్టణ నాయకులు నారపాక వసంతరావు, సుందరగిరి శీను, పట్టణ యువజన నాయకులు లలిత్ కుమార్ పాసి, తోటకూర శ్రీకాంత్, వంగ సునీల్, ఎస్.కె చాంద్ పాషా, మునిగంటి శివ, మండల యువజన నాయకులు భూక్య సురేశ్, మూలగుండ్ల ఉపేందర్ రావు, చిన్నారి, వార రమేశ్, కొండూరు రవికాంత్, మీరజ్ బేగ్, జయరాం, టేకులపల్లి మండల నాయకులు, మాజీ సర్పంచులు జబ్బ విజయలక్ష్మి, బానోతు రవికుమార్, ఆమెడా రేణుక, బానోతు నాగేందర్, మాలోత్ నివాస్, బోడ రమేశ్ పాల్గొన్నారు.