బూర్గంపహాడ్, జూలై 15 : కిన్నెరసాని వాగు వద్ద అక్రమంగా ఇసుక తోడుతున్న జేసీబీని బూర్గంపహాడ్ పోలీసులు బుధవారం సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రమైన బూర్గంపహాడ్ సమీపంలోని కిన్నెరసాని వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోడుతున్న జేసీబీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. మండల పరిధిలోని సారపాక బ్రిడ్జి కింద ఇసుక రవాణా జరుగుతున్న అనధికార ర్యాంపుల వద్ద జేసీబీతో ట్రంచ్ కొట్టించినట్లు ఆయన తెలిపారు. మండలంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.