Illegal constructions | భద్రాద్రి కొత్తగూడెం (Badradri kothagudem) జిల్లా చుంచుపల్లి మండలంలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝళిపించారు. అధికారులు రెవెన్యూ పరిధిలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చుంచుపల్లి రెవెన్యూ పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీలో గల అక్రమ కట్టడాలను జేసీబీతో భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు.
18 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఉత్తర్వులను (WP NO 6059/23) అనుసరించి కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేత ప్రక్రియలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్