చర్ల : జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్‌కుమార్ నాయుడు బుధవారం చర్ల అటవీప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సుబ్బంపేట, వద్దిపేట లో ప్లాంటేషన్ లను ఆయన సందర్శించారు. స్థానిక అటవీశాఖ సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకున్న ఆయన అక్కడ జరుగుతున్న పనులపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ పర్యటనలో ట్రైనీ ఐఎఫ్ఎస్ నీరజ్ టిబ్రేవాల్, ఎఫ్‌డీవో బాబు, చర్ల రేంజర్ ఉపేందర్, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.