విద్యార్థులకు గుణాత్మక విద్య అందించేందుకు కృషి చేయాలి : డీఈఓ వాసంతి
విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీలో గల పిఎం సిరి (జడ్.పి.హెచ్.ఎస్) బాలికల ఉన్నత పాఠశాలను ఆమె బుధవారం..
పాల్వంచ, జూలై 24 : విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీలో గల పిఎం సిరి (జడ్.పి.హెచ్.ఎస్) బాలికల ఉన్నత పాఠశాలను ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల ఫేస్ రికగ్నైజేషన్ ( ఎఫ్ ఆర్ ఎస్) ఉపాధ్యాయుల, విద్యార్థుల అటెండెన్స్ ను పరిశీలించారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులు అందరూ కూడా ఎఫ్ ఆర్ ఎస్ నమోదు చేయాలని, అలాగే పాఠశాలకు సమయ పాలన పాటించాలన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా అందజేసిన పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ లో వాటిని నమోదు చేయాలని తెలిపారు. పాఠశాలకు క్రమం తప్పకుండా విద్యార్థులు వచ్చే విధంగా, విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులకు కనీస సామర్ధ్యాల పెంపుదల కోసం ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతిలో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. ఆమెతో పాటు మండల విద్యాశాఖ అధికారి ఏ.శ్రీరామ్ మూర్తి, పాఠశాల హెచ్ఎం రమాదేవి ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

