చుంచుపల్లి, అక్టోబర్ 04 : చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర శనివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి వాహనానికి గడపగడపకు మహిళలు నీళ్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. నృత్యాలతో అమ్మవారికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.