Tamarind Tree | జూలూరుపాడు, ఫిబ్రవరి 16 : దైనందిన జీవితంలో చెట్టుకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చెట్టును పూజించే సంప్రదాయం మనది. ప్రకృతిలో ప్రతీ చెట్టుకు ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన చింత చెట్టు (Tamarind Tree) గురించి మీరెప్పుడైనా విన్నారా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో ఉంది ఈ చింత చెట్టు. కోట మైసమ్మ తల్లి దేవాలయం వద్ద మొలసిన ఓడల మర్రిచెట్టులా వేళ్లూనుకుపోయి ఉన్న ఈ చింత చెట్టుకి అక్షరాల 300 సంవత్సరాలుపైగా చరిత్ర ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
పూర్వం ఆలయ నిర్మాణం లేకపోవడంతో ఈ చెట్టు కిందనే కూట మైసమ్మ తల్లి విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించేవారు. కొన్నేళ్ల క్రితం కోట మైసమ్మ తల్లికి ఆలయం నిర్మించడంతో పక్కనే ఉన్న చింతచెట్టు ఊడలు మర్రిచెట్టును తలపించేలా ఐదుకుంటల స్థలాన్ని ఆక్రమించింది.
మొదలు చూడటానికి మర్రిచెట్టును పోలి ఉన్నట్లు ఉన్న భారీ చింత చెట్టు ఆలయానికి వచ్చే భక్తులందరికీ నీడనిస్తుంది. వేసవికాలం గ్రామస్తులు మధ్యాహ్నం వేళలో నీడతోపాటు చల్లటి గాలిని ఆస్వాదించేందుకు ఈ చెట్టు కిందికి చేరిపోతారు. వారంతా చెట్టు కిందు పలు పనులు చేసుకోవడంతో పాటు, పల్లెటూరి ఆటలాడుతూ కాలక్షేపం చేస్తుంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్