రుద్రంపూర్, ఏప్రిల్ 03 : వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కూల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఎస్.ఈ (ఈ & ఎం) అజ్మీర శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో వడదెబ్బ నుండి రక్షణ పొందేందుకు కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచుగా ద్రవాలు తీసుకోవాలని సూచించారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణి సంస్థ కార్మికులకు 75 రోజుల పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇది వడదెబ్బ నివారణలో భాగంగా చేపట్టిన ప్రత్యేక చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో డివై ఎస్ సి లింగ, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, పిఏ భద్రమ్మ, ఆముదాల అనిల్, సోలా సోల్ల నాగేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ కృష్ణమోహన్, మొగిలిపాక రవి, పి.వసంత్ కుమార్, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు మజ్జిగ పంపిణీ ప్రారంభం