రామవరం, నవంబర్ 08 : ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ సామగ్రి రేట్లను వ్యాపారులు అమాంతం పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాస్ అన్నారు. శనివారం ఉన్నాందాస్ గడ్డలో జరిగిన ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలను దృష్టిలో పెట్టుకుని ఇదే అదునుగా భావించి సిమెంట్, మట్టి, ఇటుకలు, ఇసుక, ఇనుప సామగ్రి తదితర గృహోపకరణాల రేట్లను వ్యాపారులు విపరీతంగా పెంచడం వల్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
ఈ రేట్ల పెంపుదలతో గృహ నిర్మాణాల లబ్ధిదారులు ఆర్థికంగా చితికి పోవాల్సిన వస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్దిదారులకి సిమెంట్, ఇటుక, ఇసుక, మట్టి, ఇనుప రాడ్లు తదితర సామగ్రి రేట్లు అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉన్నందాస్ గడ్డ శాఖ 1, 2 కార్యదర్శులు ఎస్కే జలీల్, తొగరు నరేంద్ర కుమార్, నాయకులు గుంజ వెంకన్న, ఎస్.కె సుభాన్ అలీ, రాజు, రేవంత్, సంపత్, మైమున భాను, పద్మ కోరి కళ్యాణి, కొత్తూరు శారద పాల్గొన్నారు.

Ramavaram : ‘గృహ నిర్మాణ సామగ్రి రేట్ల పెరుగుదలను నియంత్రించాలి’