కుమ్మెర ఘటనపై నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రజక కుటుంబం మీద అగ్రకులాలు ఆధిపత్య ధోరణితో మహిళలని చూడకుండా దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడంతోపాటు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు.
ఈ దాడిలో రెండునెలల పసిపాప మృతి చెందడం ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈఘటనలో పోలీసులు దాడిచేసిన వారిపై కాకుండా, బాధితులపై కేసు నమోదు చేయడం ఆశ్యర్యాన్ని కలిగించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ దాడిపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ, కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారితోపాటు గ్రామ సర్పంచ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిలా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

