చీకట్లో జిల్లా దవాఖాన
వాతావరణంలో మార్పులో భాగంగా మంగళవారం మధ్య రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా దవాఖానకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మం గళవారం అప్పక్‌పల్లి వద్దనున్న జిల్లా దవాఖానలో మొత్తం అంధకారం నెలకొనడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- ఇబ్బందులు ఎదురొన్న రోగులు
నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 24 : వాతావరణంలో మార్పులో భాగంగా మంగళవారం మధ్య రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా దవాఖానకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మం గళవారం అప్పక్‌పల్లి వద్దనున్న జిల్లా దవాఖానలో మొత్తం అంధకారం నెలకొనడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి 10:30 గంటల నుంచి మంగళవారం మధ్యా హ్నం 3 గంటల వరకు దవాఖానలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మొబైల్ ఫోన్ల వెలుతురులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సదరం క్యాంప్ ఉండడంతో కరెంట్ లేకపోవడం దివ్యాంగులు గంటలకు క్యూలైన్లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దవాఖానలో కనీసం జనరేటర్ సౌకర్యం లేకపోవడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే దవాఖానలోని రోగులు, వివిధ వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు వచ్చిన ఔట్ పేషెంట్లు దాదాపు 12 గంటలపాటు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి జిల్లా దవాఖానలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

