కారేపల్లి (కామేపల్లి), నవంబర్ 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జర్పుల రాజేశ్ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. టేకులపల్లి పార్టీ కార్యాలయంలో జర్పుల రాజేశ్‌కు మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బట్టు శంకర్ నాయక్, భగవాన్ నాయక్, రావొజీ రావు, జోగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు మోతిలాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.