– మర్రిగూడెం, కొమ్మగూడెం గ్రామ పంచాయతీల నుండి ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్లో చేరిక
– రెండు పంచాయతీల నుండి 150 కుటుంబాలు
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లెందు, జనవరి 13 : ఇల్లెందు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 150 కుటుంబాలు, ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ నాయక్ సమక్షంలో మంగళారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మర్రిగూడెం నాయకురాలు యదలపల్లి రేణుక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మర్రిగూడెం, కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలకు చెందిన ఇండిపెండెంట్, ఎన్డీ పార్టీలో గెలిచిన ఐదుగురు వార్డు మెంబర్లు, అధికార కాంగ్రెస్ పార్టీ నుండి 100 కుటుంబాలు, అలాగే ఎన్డీ, ఇతర పార్టీల నుండి 50 కుటుంబాలు మొత్తం 150 కుటుంబాలు మండల అధ్యక్షుడు శీలం రమేశ్ అధ్యక్షతన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Yellandu : ఇల్లెందు మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనడానికి చేరికలను చూస్తే అర్థమవుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన యువకులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఖమ్మం పాటి రేణుక, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్, బీఆర్ఎస్ నాయకులు ఎస్.రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మౌనిక, స్థానిక నాయకులు సారయ్య, కోటి, సువర్ణపాక సత్యనారాయణ పాల్గొన్నారు.

Yellandu : ఇల్లెందు మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్