ఇల్లెందు, ఫిబ్రవరి 24 : యాసంగి రైతు భరోసా ఇవ్వడంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇల్లెందు మండలం రోoపేడు గ్రామ రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రొంపేడు గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర బావ సింగ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా సంక్రాంతి పండగకు వేస్తామని, తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇవ్వపోవడం చూస్తే రైతులను మోసం చేయాలని ఉద్దేశం తప్ప మరొకటి కాదన్నారు.
యూరియా విషయానికి వస్తే యూరియా కట్టలు దొరకగా ఆదివాసి గిరిజన రైతులు నానా తంటాలు పడుతున్నట్లు తెలిపారు. యాప్ తీసుకొచ్చి రైతులను నానా గోసలకు గురి చేస్తున్నరని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలని, రుణమాఫీ పూర్తి చేయాలని ప్ల కార్డ్స్ తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అజ్మీర రాంబాబు, బాదావత్ హరిలాల్, వార్డు మెంబర్లు బానోత్ జోగ్య, అజ్మీర పద్మ, గూగుల్ సోమన్న, మూడు బీమా, భూక్యా రాంజీ, ధర్మసూత్ లక్ష్మి, మూడు బదిలీ, అజ్మీర భీముడు, రమేశ్, భగవత్ పాల్గొన్నారు.