టేకులపల్లి ఏప్రిల్ 20 : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే కోరెం కనకయ్య అన్నారు. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రం సబ్ మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో లక్కినేని సురేందర్రావు, వ్యవసాయ శాఖ ఏడిఏ లాల్ చందు, సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఏవో అన్నపూర్ణ, తాసిల్దార్ నాగ భవాని, స్థానిక నాయకులు కోరం సురేందర్ ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బోమ్మర్ల వరప్రసాద్ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.