రామవరం, సెప్టెంబర్ 20 : ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు శనివారం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్‌లతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసి దసరా పండుగ అనంతరం సంబంధిత మంత్రులు, యాజమాన్యంకి, గుర్తింపు సంఘం యూనియన్ ను సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. లాభాల వాటా విషయంలో ఈరోజు యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏఐటీయూసీ యూనియన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.