ఇల్లెందు, జూన్ 16 : ఇల్లెందు జూన్ 16 : ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఇటీవల 155 ఇంకుడు గుంతలు తవ్వించారు. అలాగే పలువురి ఇంటి యజమానులను ప్రోత్సహించి సొంతంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేయించడం జరిగింది. వాటిని జలశక్తి అభియాన్ సైట్ నందు నమోదు చేశారు. సోమవారం సెంట్రల్ టీమ్ ఇల్లందు పట్టణంలోని 24 వార్డులో పర్యటించి ఇంకుడు గుంతలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మురళి, రాజు, టెక్నికల్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.