దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొలాల వద్దకు తోలుకుపోగా అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్‌వైరు తగిలి ఆవు, ఎద్దు, ఆవుదూడలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ రంగాప్రసాద్ అక్కడకు చేరుకుని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని మండల పశువైద్యాధికారి మన్యం రమేష్‌ను పిలిపించి అక్కడే పంచనామా నిర్వహించారు. మృతిచెందిన పశువుల విలువ రూ.1.50లక్షలుపైగా ఉంటుందని బాధిత రైతు వాపోయాడు.