బూర్గంపహాడ్, సెప్టెంబర్ 09 : తెలంగాణ జాతిపిత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రాణహాని కలిగించే కుట్రపై బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం బూర్గంపహాడ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌కు భౌతికంగా కీడు జరగాలని కోరుకోవడం నేరపూరిత చర్య అన్నారు. పార్టీపరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ నేరాన్ని ప్రోత్సహించేలా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావు కోరుతూ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా నేరాన్ని ప్రోత్సహిస్తున్న వారిని క్షమించవద్దని, చట్టపరంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జవాబు చెప్పలేక బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావుకోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తో పాటు నేరాన్ని ప్రోత్సహించిన రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సారపాక పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, మండల నాయకులు మేడం లక్ష్మినారాయణరెడ్డి, దారం కృష్ణారెడ్డి, మేడగం శ్రీనివాసరెడ్డి, కురుకుంట్ల చిన్నపరెడ్డి, చేతుల పెద్దవీర్రాజు, బానోతు శ్రీను, వార్డు సభ్యులు నాగేశ్వరరావు, కోటయ్య, తుంగ నాగయ్య, మాజీ గ్రామ కమిటీలు కాసిమళ్ల సురేష్, బోరెం శ్రీను, గుల్మహ్మద్, కామిరెడ్డి పద్మ, మాజీ ఎంపీటీసీ దాసరి వెంకటరమణ, బండారి లక్ష్మినారాయణ, మదమంచి రాజేశ్వరరావు, సాదిక్‌పాషా, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, కేవీ.రమణ, యారం వెంకటరెడ్డి, నరేశ్‌రెడ్డి, పంగి సురేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్‌కు ప్రాణహాని కలిగించే కుట్రలపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు