నగోయా: భారత షూటర్లు కుమ్మేస్తున్నారు. ఏషియన్ గేమ్స్(Asian Games)లో గోల్డ్ రష్ కొనసాగుతోంది. ఇవాళ ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. క్యానన్ చెన్నాయ్, నీరూ ధండా జోడీకి గోల్డ్ మెడల్ వచ్చింది. తాజా గేమ్స్‌లో నీరూకు స్వర్ణం రావడంతో ఇది రెండోసారి. ఇప్పటి వరకు ఈ గేమ్స్‌లో ఇండియాకు ఇది 9వ గోల్డ్ మెడల్ కాగా, ఇవాళ మూడో స్వర్ణ పతకం ఇది. మిక్స్డ్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో ఇండియా జట్టు 34 పాయింట్లు స్కోరు చేసింది. రెండో స్థానంలో ఖతార్ నిలిచింది.అయితే ఈ ఈవెంట్లో ఈసారి చైనా మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఖతార్ 32, చైనా 23, ఇరాన్‌కు 12 పాయింట్లు దక్కాయి.
ANOTHER GOLD FOR INDIA! 🥇
Kynan Chenai & Neeru Dhanda strike gold in the Trap Mixed Team event at the Asian Games! 🎯
It’s Neeru Dhanda’s second gold medal at these Games, adding another golden chapter to India’s campaign!#AsianGames2026 #AsianGames #AichiNagoya2026… pic.twitter.com/a5iu7olVzK
— DD News (@DDNewslive) September 30, 2026