టేకులపల్లి, ఫిబ్రవరి 17: పుస్తక పఠనాన్ని మించిన సాధనం లేదని, టేకులపల్లి గ్రంథాయాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. టేకులపల్లి శాఖ గ్రంథాలయం టేకలపల్లి పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందిచడంకై పుస్తక ప్రియుల పాదయాత్ర మంగళవారం టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రియులు చాగంటి కృష్ణమూర్తి మాట్లాడుతూ..గ్రంథాలయంపై తనకు 50 సంవత్సరాల అనుబంధం ఉందని, గ్రంథాలయాలు విద్యార్థులకు ఉన్నత స్థానాలకు చేరడానికి ఉపయోగపడుతాయని అన్నారు.
ఎదైనా విషయంపై సమగ్ర అవగాహన ఏర్పరుచుకోవాడానికి పుస్తకాన్ని మించిన సాధనం లేదన్నారు. డిజిటల్ యుగంలో పుస్తకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విజ్ఞానాన్ని సమకూర్చుకోవడం అవసరమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి గ్రంథపాలకుడు ఆర్ నాగన్న, గ్రావీటి స్కూల్ హెచ్ఎం బ్రహ్మచారి, టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం మోహన్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బసవమ్మ, గ్రంథపాలకుడు బాబురావు, ఉపాధ్యాయులు శంకర్, టేకులపల్లి 4వార్డు నెంబర్ జాటోత్ కిరణ్, పీవైఎల్ నాయకులు నోముల భానుచందర్, సీపీఐ మండల కార్యదర్శి గుగులోత్ రాంచందర్ పాల్గొన్నారు.