భద్రాచలం: భద్రాచలశ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 28న శ్రీమద్భాగవత సప్తాహం కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు చిత్రకూట మండపంలో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు చతుష్టానార్చనతో సంపూర్ణంగా శ్రీమద్భాగవత పారాయణం, దశమ స్కంధ హవనం, సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు శ్రీమధ్భాగవత ప్రవచనములు జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ షష్టమ శ్రీమద్భాగవత సప్తాహ మహాక్రతువులో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.