దమ్మపేట:ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన నాయకులు..ఎక్కడంటే..? దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి ప్రకాష్‌నగర్ కాలనీలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి పండుగ సందర్భాల్లో చీరెలను కానుకగా అందిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షులు ఆకుల కృష్ణారావు, ఉపాధ్యక్షులు ప్రసాద్, బలుసు గోపి, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.