పాల్వంచ, ఏప్రిల్ 04 : పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో టీవీఏఈ జాక్ ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజనులుగా గుర్తింపు ఇచ్చినప్పటికీ జెన్కో యాజమాన్యం పూర్తిస్థాయిలో రూల్స్ అమలు చేయడం లేదని, ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలని కానీ వేర్వేరు రూల్స్ అమలు చేస్తూ ఆర్టిజన్లకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 23,600 మంది ఆర్టిజన్లలో దాదాపు 5,000 మంది ఎటువంటి ఎంప్లాయీ బెనిఫిట్స్ లేకుండా చనిపోవడం, పదవీ విరమణ పొందడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏపీఎస్సీబీ రూల్స్ ను వర్తింపజేసి కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని తద్వారా 19,000 ఆర్టిజన్ కుటుంబాల జీవితాలకు భరోసాను కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. యాజమాన్యాన్ని ఎన్నిసార్లు అభ్యర్థించినా తమను పట్టించుకోవట్లేదని, ఇక సహించేది లేకనే సమ్మెకు సన్నద్ధమైనట్టు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ లోపు జేఏసీని చర్చలకు పిలిచి ఆర్టిజన్ల సమస్యలు, అన్మాండ్ కార్మికుల, తదితర అంశాలను పరిష్కరించని ఎడల ఏప్రిల్ 8వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్నటువంటి ఆర్టిజన్లు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఆర్టిజన్ల ధర్నా – దద్దరిల్లిన కేటీపీఎస్ ప్రాంగణం
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, 34వ డివిజన్ కార్పొరేటర్ భట్టు లలిత, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి జలీల్, సిపిఐ నాయకులు పూర్ణచందర్రావు, నిమ్మల రాంబాబు, ఉప్పు శెట్టి రాహుల్, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, అలాగే విద్యుత్ సంస్థల్లోని ట్రేడ్ యూనియన్ నాయకులు టిఆర్వికెఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చారు గుండ్ల రమేష్, 1104 కంటే రాజేందర్, 327 సాధన రామకృష్ణ, 1535 రాధాకృష్ణ, సిఐటియు అంకిరెడ్డి నరసింహారావు, ఏఐటియుసి రావుల మురళి, బి ఎం ఎస్ గొర్రె వేణుగోపాల్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పూరపాటి రమేష్ మరియు రాష్ట్ర టీవీఏఈ జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, కన్వీనర్ సాయిలు, వైస్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, కో కన్వీనర్ చందర్ సింగ్ ఠాగూర్, జెన్ కో చైర్మన్ జక్కుల రమేష్, కన్వీనర్ ఆవుల కృష్ణారెడ్డి, ఒకన్వీనర్ చిలివేరు మల్లయ్య, కేటీపీఎస్ టీవీ ఏఈ జెఏసి చైర్మన్ వెంపటి అనిల్ కుమార్, కన్వీనర్ మంకెన వెంకటేశ్వర్లు, కో చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, కో కన్వీనర్ సాయిబాబు, వైస్ చైర్మన్ వెంకట్రావు, ట్రెజరర్ రమేష్, జేఏసీ నాయకులు సాంబ, రవీందర్,కిరణ్, శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు శారద, దేవి, మంగమ్మ, సతీష్, పల్లం రాజు పాల్గొన్నారు.