రుద్రంపూర్, ఫిబ్రవరి 12 : సింగరేణి ఏరియాలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో ఆఫ్ లోడింగ్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు లేబర్ చట్టాల వల్ల అన్ని వర్గాల కార్మికులు నష్టపోతున్నారని పేర్కొంటూ అన్ని కార్మికుల సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వికె సీఎం ఓబీ నందు కార్మికుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు కార్మికులందరికీ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపారు. 29 చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా చేయడం వల్ల కాంట్రాక్టర్లు, యాజమానులు లబ్ధిచేకూరే విధంగా ఉండడం వల్ల వాటిని తక్షణమే రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వి కే సీఎం ఓబీ కమిటీ జేఏసీ తరఫున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మార్షల్ శీను, భూక్యమోహన్, ఐఎన్టీయూసీ జెట్టి మోహన్, బూరుగు సతీష్, ఐఎఫ్టీయూ సంజీవ్, అశోక్, సీఐటీయూ నాగయ్య, కట్టా సీను, టీబీజీకేఎస్ హైమద్, పాషా, డీడబ్ల్యూయూఎస్ బాచిరెడ్డి, పెంకి రమణ, టీటీఎన్టీయూసీ రవి గౌడ్, కోటి, సీకేహెచ్పీఎస్ నవీన్. రవి పాల్గొన్నారు.