రుద్రంపూర్, జనవరి 28 : కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు ఉత్తమ అధికారిగా ఎంపికై గణతంత్ర దినోత్సవం నాడు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ.. ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు, నాణ్యమైన బొగ్గు రవాణా, కార్మికుల భద్రతా చర్యల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు జీఎంకు ఈ గుర్తింపు లభించినట్లు తెలిపారు. కార్మిక కాలనీల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో, ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లోనూ పలు సంక్షేమ కార్యక్రమాలు అందించారని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయనకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, ఏరియా బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, క్రిస్టోఫర్, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, హుమాయూన్, పిట్ కార్యదర్శులు మధు కృష్ణ, భుక్య రమేష్, నాయకులు మండల రాజేశ్వరరావు, మల్లికార్జున్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.