రుద్రంపూర్, మార్చి 16 : సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పివికే 5 గనిలో జరిగిన వాల్ పోస్టర్ ను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు విడుదల చేసి మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కొన్ని సమస్యలను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించి ఇంతవరకు వాటి అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్లు జారీ చేయలేదన్నారు. ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని కనుక భవిష్యత్ కార్యాచరణ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఏఐటీయూసీ ఈ నెల 17 నుండి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను, ఏప్రిల్లో జరగబోయే సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కావున జరగబోయే ఆందోళన కార్యక్రమంలో పివికే5 గని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సింగరేణి మనుగడను కాపాడాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు, ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి భూక్యా రమేశ్, పిట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.నాగేశ్వరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి సాయి పవన్, రాంచందర్, సురేందర్ రెడ్డి, సంజీవ్, విక్రమ్, సుమన్, సంతానం, రామారావు, విజయ్, శ్రీను, శశి, భద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.