చండ్రుగొండ: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భర్తి చేయనున్న రేషన్డీలర్ల నియామకంలో ఏజెన్సీ ప్రాంతంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏజెన్సీ దళితసేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నడ్డి రవికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేయటం అభినందనీయమని, ఇకపై ఏజెన్సీలో ఏ నియామకం జరిగినా అన్నివర్గాలకు సమానంగా ఉండాలన్నారు. భవిష్యత్తులో అన్నివర్గాలకు న్యాయం జరిగేలా ఉద్యమాలు, పోరాటాలకు సిద్ధంగా ఏజెన్సీ దళితసేవా సంఘం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.