Adivasi People | ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న నిషేధిత మావోయిస్టులు : ఎస్పీ రోహిత్ రాజు
Adivasi People | ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసీ ప్రజలను నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ జీవనం సాగించడానికి నిత్యం సంచరించే ప్రదేశాలలో మందు పాతరలను అమర్చుతూ వారు ప్రాణాలు కోల్పోయే విధంగా మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
Adivasi People | నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ జీవనం సాగించడానికి నిత్యం సంచరించే ప్రదేశాలలో మందు పాతరలను అమర్చుతూ వారు ప్రాణాలు కోల్పోయే విధంగా మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
మూడు రోజుల క్రితం చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన కుంజం పాండే తన సోదరితో కలిసి ఉట్లపల్లి అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా నిషేధిత సీపీఐ మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి తీవ్ర గాయాల పాలయ్యి తన కుడి కాలును కోల్పోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న చర్ల పోలీసులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ఆమెకు వైద్య చికిత్సలు చేపించడం జరిగిందని తెలిపారు.
అమాయకపు ఆదివాసీ ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న మావోయిస్టుల తీరును ఎస్పీ తీవ్రంగా ఖండించారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుంటే, నిషేధిత మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే విధంగా చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
Read Also :
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

