పాల్వంచ, ఆగస్టు 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాల రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. యూరియా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. అవినీతి లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని, యూరియా బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా కొరత కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రత్యేక పరిహారం అందజేయాలన్నారు. భవిష్యత్‌లో యూరియా కొరత రాకుండా నిల్వలు ఉంచాలన్నారు.
బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రధానంగా రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సాగు నీరు అందక, యూరియా దొరక్క, పెట్టుబడి సాయం లేక హరి గోస పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆపరేటివ్ సొసైటీ మాజీ ఉపాధ్యక్షుడు కాంపెళ్లి కనకేష్, సీనియర్ నాయకులు కిలారి నాగేశ్వరరావు, మల్లెల రవిచంద్ర, మడి సరస్వతి, మార్గం గురవయ్య, సింధు తపస్వి, మందుల మంజుల, డిష్ నాయుడు, తెలంగాణ సురేశ్, జందు నాయక్, వజ్జా వీరయ్య, వీర్రాజు, సంపత్ రెడ్డి, కొండల్ రావు, ఉదయ్ జాస్కర్, గుంటి వీరయ్య, రాంబాబు, వెంకట నారాయణ, శ్రీశైలం, అఖిల్, మహర్షి, హర్ష, రంజిత్, శేఖర్, ఏ.వీ.రమణ పాల్గొన్నారు.