వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఏఐ చాట్ గ్రోక్ అత్యంత కచ్చితంగా అంచనావేసింది. అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్’ చెప్పిన జోస్యం నిజం కావటం సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై మస్క్ స్పందిస్తూ, ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఒక పద్ధతి ప్రకారం పరిశీలనలు జరిగిన మీదట వచ్చిన సమాధానమిదని మస్క్ చెప్పారు. ఇరాన్‌పై సైనిక చర్య ఎప్పుడు ఉండే అవకాశముంది? అని ఫిబ్రవరి 25న ఆంథ్రోపిక్ క్లాడ్, జెమినై, చాట్‌జీపీటీ, గ్రోక్‌లను ప్రశ్నించగా, గ్రోక్ మాత్రమే శనివారం, ఫిబ్రవరి 28గా కచ్చితమైన తేదీతో సమాధానమిచ్చింది. అంతేగాక దౌత్యపరమైన ప్రయత్నాలు, మిలిటరీ సన్నద్ధతను కూడా ప్రస్తావించటం గమనార్హం.