Prajavani | భద్రాద్రి కొత్తగూడెం : ప్రజా వాణికి అధికారులు ఆలస్యంగా రావడంపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి (Prajavani)కి అధికారులు తక్కువగా హాజరవడం.. వచ్చిన వారు కూడా ఆలస్యంగా రావడంతో ఆయన వార్నింగ్ ఇచ్చారు.
కలెక్టర్ సారు వచ్చే ముందు అందరూ వచ్చారా అని అడిగితే.. అరగంట ఆగిన తర్వాత రండి అందరూ వస్తారని చెప్తే.. మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తారా..? అని ప్రజావాణికి వచ్చిన అధికార్లను ఆయన మందలించారు. ప్రతీ గ్రీవెన్స్‌కు ఆలస్యంగా రావడం పద్దతి కాదని అన్నారు. మేము ఉదయం 10.30 గంటలకు అని చెప్తే మీరు 11 గంటలకు రావడమేమిటి అని ప్రశ్నించారు. ఇక నుండి ఇలాంటి తప్పిదం జరగకూడదని హెచ్చరించారు.
KCR Birthday | ‘ప్రజల హృదయాల్లో నిలిచి.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్’
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్