ఇల్లెందు, సెప్టెంబర్ 26 : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు సీఐ తాటిపాముల సురేష్ హెచ్చరించారు. శుక్రవారం ఇల్లెందులోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇల్లెందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.